ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులు పనిదినాలను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏపీ సెక్రటేరియట్, విభాగాల అధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలకు వర్తిస్తుంది. ఈ మేరకు జీఏడీ సర్వీసెస్ సెక్రటరీకి సీఎం కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి లేఖ పంపారు. శనివారం మరియు ఆదివారం మినహా వారంలో 5 రోజులు ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.30 వరకు. ఈ నెల 27 నుంచి అమలులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa