కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఢిల్లీలో విపత్తు నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విపత్తు నిర్వహణ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పట్టణ ప్రాంతాల్లో వరదలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, అగ్నిమాపక దళ సేవలను పటిష్టం చేయడం, కొండచరియలు విరిగిపడడం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం నిధులు రూ. 8 వేల కోట్లు రాష్ట్రాలకు అందిస్తామన్నారు.