ఉద్యోగులకు వైసీపీ సర్కార్ కు మధ్య సాగుతున్నవార్ కు తెరపడిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల కారణంగానే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనాసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని పట్టించుకోనక్కర్లేదని సీఎం జగన్ ఉద్యోగులకు సూచించారు.
ఉద్యోగుల సమస్యలను వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఉద్యోగులకూ, ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామని.. జీపీఎస్ కోసం 2 సంవత్సరాలు కసరత్తు చేశామని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని డీఆర్ లు జీపీఎస్ లో ఇస్తున్నామని చెప్పారు. GPS అన్నది దేశానికే రోల్ మోడల్ అవుతుందని సీఎం జగన్ వివరించారు.