తమ పార్టీ అగ్ర నాయకులపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శలు చేయడం తగదని బీజేపీ కోవూరు నియోజకవర్గ కమిటీ కన్వీనర్ ఇండ్ల రాఘవేంద్ర అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... దేశ సంక్షేమం కోసం పనిచేసే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షాను కించపరచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుండగా.. ఎమ్మెల్యే అమిత్‌షా, నడ్డాలను విమర్శించడటం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. విలేఖరుల సమావేశంలో మండల కమిటీ అధ్యక్షుడు ఐనకోట రఘురామయ్య, కొడవలూరు మండల కమిటీ అధ్యక్షుడు పగడాల మురళీకృష్ణ, కిసాన్‌మోర్చా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి గాదిరాజు చక్రవర్తి, కోవూరు మండల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి సుబ్బారావు, కొడవలూరు మండల కమిటీ అఽధ్యక్షుడు మాచవరం రఘురామయ్య మాట్లాడారు.