ప్రజల జీవితాల్లో వెలుగులు అందించాల్సిన విద్యా వ్యవస్థ వైసీపీ పాలనలో నిర్వీర్యం అవుతుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చలగాటం అడుతున్నారని అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మువ్వా చరత్చంద్ర ఆ ధ్వర్యంలో ఫీజుఎక్కడ కంస మామ?పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతుతూ వైసీపీ పాలనలో విద్యార్థులకు సక్రమంగా ఫీజురీయింబర్స్ జరగటంలేదన్నారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పేరుతో వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. అమ్మఒడి వంటి పథకాలు సైతం అందరికి వర్తించటం లేదన్నారు.