భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని బిజెపి మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సాయంత్రం బిజెపి విశాఖ జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొదటగా మాట్లాడిన జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర నగరంలో ఎంపి ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ సంఘటను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ కేసులో పోలీసులు చూపించిన చొరవ అభినందనీయమని అన్నారు. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యుడు జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ నరేంద్రమోడీ పాలన లో భారతదేశం ఎంతో ప్రగతిని సాధించిందని ప్రతి పేదవారికి ఉచిత రేషన్ అందించామని, కోవిడ్ కోసం 200 కోట్ల జనాభాకు వ్యాక్సిన్లు ఉచితంగా అందించమని తెలిపారు.
అంతేకాకుండా కోవిడ్ సమయంలో ప్రతి నిరుపేద మహిళలకు 500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని. వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందించమని అన్నారు. మూడు కోట్లకు పైగా ఇల్లు కట్టించి నిరుపేదలకు అందించమని ప్రతి రైతుకు సంవత్సరానికి 8000 ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఇప్పటికే సంవత్సరానికి 18000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో ఉక్ర్రెయిన్ యుద్ధ సమయంలో ప్రతి విద్యార్థిని తమ స్వస్థలాలకు చర్చి అద్భుతమైన ఘనత సాధించామని, మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమదిగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి బిజెపి మోడీ పాలనలో దేశం సాధించిన పురోగతిని ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.