జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి, ఏడీఆర్ డా. ఎం. సురేశ్ కుమార్ శుక్రవారంతెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కనిష్ఠంగా 8. 8 మి. మీ, గరిష్ఠంగా 29. 7 మి. మీ వర్షం కురుస్తుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24. 5-29. 9, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31. 7-41. 4 డిగ్రీలుగా నమోదవుతాయని, గాలిలో తేమ 49-97 శాతం ఉంటుందని తెలిపారు.