అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలు, గుడ్లు, నాణ్యతగా ఉండాలని, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే తిరిగి పంపివేయటం జరుగుతుందని ఐసిడిఎస్ పీడీ సూర్యలక్ష్మి అన్నారు. ఎప్పటికప్పుడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో సిడిపిఓలతో సమీక్షలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని సిడిపిఓలందరూ ప్రతి నెలా మూడు దఫాలుగా గుడ్లు సరఫరా చేసే గోడౌన్ ను సందర్శించి, పాడైన గుడ్లను, సరుకులను పక్కకు తీసివేయాలనిశనివారం ఆదేశించామన్నారు.