ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించిన ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల పురోగతిని సమీక్షించాలన్నారు.