పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డీవైఎ్‌ఫఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని, వీరనాల శివకుమార్ డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ఖాళీగా ఉన్న యానిమల్ హస్బండరి అసిస్టెంటు పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం జగనమోహనరెడ్డి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ అధికారులు కొత్తగా క్లస్టరు విధానం ప్రవేశపెట్టి 3 నుంచి 5 రైతు భరోసా కేంద్రాలను క్లస్టరుగా ఏర్పాటు చేసి పోస్టులు మిగులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని వల్ల రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుంచి డైరీ ఒకేషనల్ డిప్లమా చదివిన అభ్యర్థులు సుమారు 30వేలకు పైగాన నష్టపోతున్నారన్నారు. ఈ మూడేళ్లలో సచివాలంయ, మూడో సంవత్సరాలుగా నోటిఫికేషన వస్తుందని, కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి చాలా ఆశలతో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ క్లస్టరు విధానం వెంటనే తొలగించి ఖాళీలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ నాయకులు ఓబులే సు, విజయ్ వెటర్నరీ అసిస్టెంటు నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.