పూరీలో జగన్నాథుని రథయాత్ర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు లక్షల్లో తరలిరావడంతో పూరీ మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. రథోత్సవంలో భాగంగా రథంపై జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం మంగళ హారతి నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం పూరీకి చేరుకుని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa