విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశానన్నారు. ఎంపీ ఇంట్లోకి దుండగులు ప్రవేశించి రోజుల తరబడి అక్కడే ఉండి గంజాయి, మాదక ద్రవ్యాలు వాడారని, దుండగులకు ఎంపీ సత్యనారాయణకు మధ్య చాలా వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని నారాయణ అన్నారు. కిడ్నాప్ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని, దీనిని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa