నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ అన్నే రామకృష్ణయ్య జడ్పీ హైస్కూల్ ఆవరణములో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి రాధికా రాణి యోగ దినోత్సవ ప్రత్యేకత, యోగాతో విద్యార్థులకు కలిగే లాభాలను వివరించారు. నిత్యం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని సూచించారు. పాఠశాల పిడి పి రవీంద్ర విద్యార్థులకు యోగ సాధనలో శిక్షణ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa