యోగా అనేది మనస్సు, శరీరాన్ని కలిపే పురాతన కళ అని స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయన శృంగగవరపుకోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం వలన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుందని, మనలో గల ఒత్తిడిని, ఆందోళనల నుండి ఉపశమనం కలిగించేందుకు చక్కని మార్గమని ఆయన తెలిపారు. యోగా దేశంలో ప్రజాదరణ పొంది, సామరస్యం, శాంతితో ప్రజలను ఏకం చేస్తోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసే అలవాటును అలవర్చుకుని, ప్రశాంతతనుఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన నూతనంగా ప్రారంభించిన బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలోఎస్. కోట ఎం. పి. పి సండి సోమేశ్వరరావు, జెడ్పీటిసి సభ్యులు ఎమ్. వెంకటలక్ష్మి, , వైస్ ఎం. పి. పి ఇందుకూరి సుధారాజు, స్థానిక సర్పంచ్ గాలి సన్యాసయ్య, ఎం. పి. టి. సి కనకమహాలక్ష్మి, స్కూల్ కమిటీ చైర్మన్ తగరంపూడి రమణ, స్థొనిక పెద్దలు జోగారావు మాస్టారు, మహలక్ష్మినాయుడు, సీతారాంపురం ఎం. పి. టి. సి సన్యాసప్పడు, వార్డు మెంబర్ గణేష్, మామిడిపల్లి మాజీ సర్పంచ్ రమణ, కిషోర్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరాములు, యోగా ఉపాధ్యాయులు తధితర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa