తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం ఇటీవల సవాల్ గా మారుతోంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ప్రమాదం జరిగింది. జీఎంసీ టోల్ గేట్ దాటే క్రమంలో ఈ మధ్యాహ్నం ఒక పోలీసు వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa