వలసదారులతో వెళ్తోన్న ఓ పడవ మధ్యధర సముద్రంలో బోల్తా కొట్టింది. ట్యూనీషియా-ఇటలీ సముద్ర సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో పడవ ఇటలీకి బయల్దేరింది. ఈ క్రమంలో భారీ గాలులు వీచడం వల్ల ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద పడవ బోల్తా పడింది. 37 మంది గల్లంతయ్యారని, నలుగురు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa