ఓ వ్యక్తి కుక్క కోసం తన కుటుంబాన్ని వదులుకొని జీవిస్తున్న ఘటన తిరునిండ్రవూరులో జరిగింది. నెమిలిచ్చేరిలోని ఓ కళాశాలలో కాపలాదారుడిగా పనిచేస్తున్న సుందర్ తన పెంపుడు శునకం బ్లాకీతో జీవిస్తున్నాడు. బ్లాకీ తన యజమాని పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుంది. దీనిపై సుందర్ మాట్లాడుతూ 'బ్లాకీ వీధి శునకం. ఏడాది వయసుండగా నా వెంట వచ్చింది. దానిని బయటకు గెంటేయమని కుటుంబ సభ్యులు గొడవపడటంతో దానిని తీసుకుని ఇంటి నుంచి వచ్చేశా' అని తెలిపాడు.