ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతి చెందిన మృతుడి ద్విచక్ర వాహనం రైలు పట్టాల సమీపంలోనే ఉండడంతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు మృతి చెందాడ అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలానే మృతుడి వివరాలు తెలియవలసి ఉందని రైల్వే పోలీసులు అన్నారు.