ఇంటింటి సర్వే ద్వారా కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తించాలని కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జి. హనీఫ్ బాబ, మెడికల్ ఆఫీసర్ డా. శ్రీనివాస్ అదేశించారు. సోమవారం ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెల 26 నుండి జూలై 16వరకు జరుగుతుందన్నారు. కుష్టువ్యాధి రహిత సమాజం కోసం అనుమానం ఉన్న వారు వైద్య సిబ్బందికి తెలపాలన్నారు. వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించడం, ఎండీటీ మందులు క్రమం తప్పక తీసుకోవడంతో పూర్తిగా బయటపడగలరన్నారు. డీ. పీ. యం. ఓ శ్రీను, హెచ్ఈ శోభరాణి, సూపర్వైజర్ బి. ఏ. వర ప్రసాద్ చంద్రకళ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.