అమరావతిలో పేదలకు సంబంధించిన 47వేల ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం జగన్ నేరుగా ఇటీవల పట్టాలిచిన నెలలోపే ఇళ్ళ నిర్మాణానికి అనుమతులు సాధించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. జూలై 8న అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వైసీపీ నాయకులు మంగళవారం తెలిపారు. మరో 3వేల ఇళ్ల మంజూరుకు కూడా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.