ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కాలేజీని అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈ కాలేజీ ఉంది. గత ఐదేళ్లుగా ట్యాక్స్ చెల్లించకపోవడంతో కాలేజీని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ సీజ్ చేశారు. కళాశాల యాజమాన్యం దాదాపు రూ. 1.65 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నుకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఎన్ని సార్లు నోటీసులు పంపించినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. దీంతో, మున్సిపల్ కమిషనర్ కాలేజీలోని విద్యార్థులను బయటకు పంపి, గేటుకు తాళం వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నో నోటీసులు పంపినా కళాశాల యాజమాన్యం స్పందించకపోవడంతోనే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa