మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఇదిలావుంటే వై.ఎస్.వివేకా 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో తొలుత నిందితుడిగా అరెస్టయిన మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆ తర్వాత అప్రూవర్ గా మారాడు. దస్తగిరి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. అయితే దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని వివేకా హత్య కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శివశంకర్ రెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న పిమ్మట ఆ పిటిషన్ ను జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం కొట్టివేసింది. నిందితులకు ఇలాంటివి కోరే హక్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.