మనదేశం విశ్వాసాలకు పెట్టింది పేరు. ఇదిలావుంటే తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఢిల్లీలో ఈ ఉదయం హనుమాన్ ఆలయాన్ని, దర్గాను అధికారులు కూల్చివేశారు. భజన్‌పురా చౌక్‌లో ఢిల్లీ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) ఈ కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. షహరాన్‌పురా జాతీయ రహదారి విస్తరణ చేయాలని నిర్ణయించిన అధికారులు అడ్డుగా ఉన్న హనుమంతుడి ఆలయాన్ని, దర్గాను కూల్చివేశారు. కూల్చివేత కార్యక్రమం శాంతియుతంగా సాగుతున్నట్టు ఢిల్లీ నార్త్‌ఈస్ట్ డీసీపీ జోయ్ ఎన్ టిర్కీ తెలిపారు. హనుమంతుడి ఆలయం, మసీదు కూల్చివేతకు ముందు మత కమిటీల అనుమతి తీసుకున్నట్టు పేర్కొన్నారు. రెండింటినీ పూర్తి సామరస్యంగా తొలగించినట్టు తెలిపింది.