గిరి ప్రదక్షణలో భాగంగా సోమవారం ఉదయం జాతీయ రహదారితో పాటుగా మాధవధార ప్రధాన రహదారి పై గిరి ప్రదక్షణ భక్తులతో పోటెత్తిన రహదారులు. రహదారి గుండా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. అటు జీవీఎంసీ అధికారులు సైతం సోమవారం రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం మంచినీరు, మెడికల్ క్యాంప్ లను అందుబాటులో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.