విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్యం ప్రకటించిననాటి నుంచి కార్మిక సంఘాల నాయకులు, ఉక్కు ఉద్యోగులు దీక్షను మరింత ఉదృతంగా కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘిబావం తెలిపేందుకు ఈనెల, లేదా వచ్చే నెలలో విశాఖ వస్తున్నట్లు కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తమపార్టీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.