వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు.. గొప్పవైన మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వీడియో త్వారా తన సందేశమిచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ సీఎం వైయస్ జగన్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి మరీ ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ తన బెస్ట్ విషెష్ తెలిపారు.