70 వేల టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆనాడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో..ఇప్పుడు వారే ఉన్నారు. పేదలకు తమ సొంత ఇంటి కల వాస్తవానికి చాల దూరంగా ఉంటుంది.సొంత ఇళ్ళు ఉన్నప్పుడు సమాజంలో చాల గౌరవం ఉంటుంది. అన్ని సముదాయాలతో పేదల ఇంటి కలను సిఎం వైయస్ జగన్ సాకారం చేశారు. లబ్ధిదారుల చెలించాల్సిన సొమ్మును సగానికే తగ్గిండం తో పాటుగా ..రూపాయికే సొంతింటిన అప్పగించిన ఘనత సిఎం వైయస్ జగన్‌ది. గత పాలకులు ఓట్ల రాజకీయం చేశారు. సీఎం వైయస్ జగన్ 30 లక్షల ఇళ్ళ పట్టాల ఇవ్వడం ప్రపంచ రికార్డ్’ అని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఊళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియా, టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీ నేతలు టీడ్కో గృహాలు తమవని సెల్ఫీ చాలెంజ్‌లు చేస్లున్నారని, టిడ్కో ఇళ్లను సీఎం వైయస్ జగన్ సమూలంగా సంస్కరించారన్నారు.