ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. సభా వేదిక, డెయిరీ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోని పాడి రైతులకు మేలు చేసేందుకు మూతపడిన విజయా (చిత్తూరు) డెయిరీని అమూల్ ఆధ్వర్యంలో పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. చిత్తూరు డెయిరీ ప్రారంభించిన అనంతరం చీలాపల్లి సీఎంసీలో 300 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.