ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదవాడికి అందుతున్న సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు,ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని దీన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తిప్పి కొట్టాలని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో రెండవరోజు ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు.ముందుగా సర్పంచ్ బ్యూల రాణి రాజశేఖర్,ఎంపిటిసిలు లక్ష్మీ,నాయకులు డిష్ వెంకటేష్,శన్ముఖ్ గౌడ్, వెంకటేష్,నల్ల సుంకన్న తదితరులు మాజీ ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ప్రతి గడపకు వెళ్లి సీఎం అందిస్తున్న పథకాలను మాజీ ఎమ్మెల్యే వివరించారు.ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు.