మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కె. ఎస్. జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం. టి. కృష్ణబాబు, మహిళా, శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం. విజయ సునీత, ఏపీ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అండ్ వీసీ జి. వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.