నేడు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నగరం మొత్తాన్ని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎమ్మెస్సార్, దర్గా సర్కిల్, గాంధీ సర్కిల్, గిరింపేట సర్కిల్, కట్టమంచి అన్ని ప్రాంతాల్లో ఇవి వర్తిస్తాయి. ఆంక్షల పేరుతో సామాన్య ప్రజలను, డిపార్ట్‌మెంటులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. పోలీసుల తీరుతో సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా వీలు లేకుండా ప్రజలను పోలీసులు నిర్బంధిస్తున్నారు అంటూ పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.