‘‘రాష్ట్రంలో సహకార డెయిరీలను సమర్థంగా నడిపే సత్తా ఇక్కడి వారికి లేదా? స్థానిక డెయిరీలను కాదని గుజరాత్‌కు చెందిన అమూల్‌ను తీసుకురావడానికి కమీషన్లే కారణమా?’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి, అచ్చెన్నాయుడు ఓ లేఖ రాశారు. ‘‘సహకార డెయిరీల ఆస్తులు, మౌలిక వసతుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చుతో కలిపి రూ.6 వేల కోట్లు అమూల్‌కు దోచిపెట్టడం దుర్మార్గం. ఒక్క చిత్తూరు డెయిరీలోనే రూ.650 కోట్ల ఆస్తులను అమూల్‌కు అప్పనంగా కట్టబెట్టారు. అమూల్‌కు దాసోహమనడాన్ని ప్రభుత్వం మానుకోవాలి. రాష్ట్రంలోని సహకార డెయిరీలకు సర్కారు మద్దతుగా నిలవాలి’’ అని అచ్చెన్న లేఖలో కోరారు.