'ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు లేడు. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు' అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. దక్షిణ ముంబైలో తన ఎన్సిపి విభాగం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పవార్ మాట్లాడుతూ.. ఆయన (మోదీ) నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపును వెంటనే ప్రకటించకపోవచ్చని అజిత్ పవార్ సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని, అందుకే మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరడం ద్వారా కేంద్రానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.