పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం వివిధ మంత్రిత్వ శాఖలు, శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ప్రకటించారు. ఆగస్టు 11 వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. 23 రోజుల పాటు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 17 సభలు ఉంటాయని తెలిపారు.పాత భవనంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి సోమవారం తెలిపారు.