-సమాజ శ్రేయస్సు ప్రథమ స్థానాన్ని పొందుతుంది
-మహిళే భవిష్యత్తు. మహిళలు మహానాయకులు
-ప్రపంచ ప్రగతి పడతులతోనే పరిఢవిల్లగలదు
-జర్మన్ ఛాన్సలర్ గా ఏంజెలా మెర్కెల్ అధికారంలో ఉన్నారు
-లింగ వివక్షతా చట్టాలు నేటికీ కొనసాగుతున్నాయి
రాజకీయాలలో మహిళల పాత్ర పెరిగితే ప్రజాస్వామ్యాలు శక్తివంత మౌతాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల వ్యాఖ్యానించింది. మహిళలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించక పోవడం న్యాయ బద్ద, సమస మాజాన్ని నిరాకరించడమే. స్త్రీలు చట్ట సభలలో ఉంటే మొత్తం సమాజానికి ప్రయోజనం కలిగించే చట్టాలు చేయబ డతాయి. బాలలు, యువకులకు శాస్త్రీయ, సామాజిక దృక్పథాలు, మానవత్వం, అలవడతాయి. సమాజ శ్రేయస్సు ప్రథమ స్థానాన్ని పొందుతుంది. ప్రపంచ ప్రగతి సుసాధ్యమౌతుంది. పురుష రాజకీయ శాసనంతో సగం సమాజానికే మేళ్ళు జరుగుతాయి.
సామ్రాజ్యవాదుల నోట స్త్రీల భవిష్యత్తు మాట : ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ హిల్లరి క్లింటన్ గాజు పైకప్పున్న గదిలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ గాజు పైకప్పును పగలగొట్టడమే. పురుషా దిపత్యానికిది ప్రతీక. అని సహచరులు వ్యాఖ్యానించారు. ప్రపంచానికి బంగా రు భవిష్యత్తును అందించాలంటే మహిళలు తమ అడ్డుగోడలను పడగొట్టాలి. ట్రంపు కంపు విశ్వవ్యాపితమైన నేపథ్యంలో హిల్లరి ఒక సభలో మాట్లాడారు. మహిళే భవిష్యత్తు. మహిళలు మహానాయకులు. చరిత్ర నిర్మాతలు. భవిష్యత్తు కోసం అడ్డుగోడలను పడదోయగల ధీరలు. ట్రంపు నిరసన మహిళా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా వాషింగ్టన్ లో 5 లక్షల మంది, ప్రపంచవ్యాపితంగా 30 లక్షల మంది మిహ ళలు నిరసన ప్రదర్శ నలలో పాల్గొన్నారు. ఆదిలో మోదీని సమర్థించినవారు ఇప్పుడు విమర్శిస్తున్నా రు. ట్రంపు కార్డులు ఇంకా తమ పూజల పొరపాట్లను ఒప్పుకోలేదు. భవిష్య త్తులో తాను అమెరికా అధ్యక్షురాలనవుతానన్న ధీమాతో హిల్లరి ఆమా టలన్నా నిజంగా ప్రపంచ ప్రగతి పడతులతోనే పరిఢవిల్లగలదు.
ప్రపంచంలో రాజకీయ లింగవివక్షత: మహిళలు పార్టీలకతీతంగా విధులు, బాధ్యతలలో తమ రాజకీయ సామర్థా్యన్ని, నాయకత్వలక్షణాలను నిరూపిం చారు. అన్ని రంగాలలో తమ శక్తిసామర్థా్యలను, ప్రతిభాయోగ్యతలను నిరూ పించుకున్నా వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం లేదు. వివక్షతాపూరిత చట్టాలు, పురుషానుకూల ధోరణులు, సంస్థలు కొనసాగుతున్నాయి. ఉన్నత స్థాయి రాజకీయ నిర్ణయాలలో, మంత్రివర్గ, పార్లమెంటరీ స్థానాలలో స్త్రీ పురు షుల మధ్య తేడాలను తొలగించుకున్న దేశాలను లింగ వివక్షతను రూపు మాపిన దేశాలుగా పరిగణిస్తారు. గత 50 ఏళ్ళలో ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం 62 దేశాలలోనే మహిళలు అధికారం చేపట్టారు. వీటిలో చాలా చిన్నవైన్ మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక ఉండటం విశేషం. నార్డిక్ (నార్వే, డెన్మార్‌క, ఫిన్లాండ్, స్వీడెన్, ఐస్ లాండ్), బాల్కన్ (ఆగ్నేయ ఐరోపా) దేశాలలో మహిళానాయకుల పరిస్థితి మెరుగు. ర్వాండా, బొలీవియా, క్యూ బాలలో ప్రస్తుతం మహిళా పాలకులు లేకున్నా ఆదేశ చట్టసభలలో మహిళా ప్రతినిధులు అధిక శాతంలో ఉన్నారు. ఐస్ లాండ్ 70%, ఫిన్లాండ్ 60% లింగ వివక్షతను తగ్గించాయి. రాజకీయ లింగ వివక్షతను తగ్గించిన దేశాలలో ఐస్ లాండ్, ఫిన్లాండ్, నార్వే, నికరాగువా, ఐర్లాండ్, స్వీడెన్, బంగ్లాదేశ్, ర్వాండా, భారత్, జర్మనీ వరుసగా మొదటి 10 స్థానాలలో ఉన్నాయి. 39 దేశాలు కేవలం 10% వివక్షతను తొలగించాయి. ఒమన్, లెబనాన్, కటార్ మరీ 3 శాతంలోనే ఉన్నాయి. ఏ దేశమూ సంపూర్ణ మహిళా రాజకీయ సాధికారితను సాధిం చలేదు. మహిళా రాజకీయ సాధికారితలో మొదటి 10 స్థానాలలోనున్న దేశా లలో కేవలం 3 దేశాలు మహిళా నాయకత్వంలో ఉన్నాయి. 16.10.2013 నుండి నార్వే ప్రధాన మంత్రిగా ఎర్నా సోల్బర్‌గ, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా షేక్ హసీనా, జర్మన్ ఛాన్సలర్ గా ఏంజెలా మెర్కెల్ అధికారంలో ఉన్నారు. గత 50 ఏళ్ళలో మహిళలు కేవలం 20% పార్లమెంటు సభ్యులుగా, 18% మం త్రులుగా 47% దేశాలలోనే అధికారంలో ఉండగలిగారు. ప్రపంచవ్యాపితంగా చట్టసభలలో 1995 లో 11.3 శాతంగా ఉన్‌న మహిళా ప్రాతినిధ్యం జూన్, 2016 నాటికి 22.8 శాతానికి ఎదిగింది. జనవరి, 2015 నాటికి 17% మంత్రులుగా ఉన్నారు. సెప్టెంబర్, 2016 నాటికి దేశాధినేతలుగా 10 మంది, ప్రభుత్వాధినేతలుగా 9 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
ఐక్య రాజ్య సమితి లో మహిళ : పేదరికం, అసమానతల అసలు కారణాల అంతానికి ప్రశాంత్, న్యాయయుక్త, సమ్మిళిత సమాజ నిర్మాణానికి, కార్యా చరణ ప్రణాళికలుగా 2015 లో ప్రపంచనాయకులు స్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించారు. ఈ లక్ష్యసాధనలో మహిళలది ప్రధాన పాత్ర. అందులోని 5 వ లక్ష్యం లింగసమానత, మహిళా, బాలికా సాధికారితలను సాధించడానికి ఉద్దే శించబడింది. మహిళలు, బాలికలపై హింసను, అత్యాచారాలను అరికట్టడం, వారి భద్రతకు చర్యలు తీసుకోవడం, గృహనిర్వహణలో వారి శ్రమ పాత్ర, విలువలను గుర్తించడం, స్త్రీల సమానహక్కులు, ఆర్థిక వనరులకు సంస్కరణలు చేపట్టడం, లింగ, సంతానోత్పత్తి, ఆరోగ్యాల హక్కులకు సార్వజనీనతను నిర్ధారి ంచడం, అన్ని స్థాయిలలో ప్రజాజీవితంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక నిర్ణయ నిర్మాణంలో క్రియాశీలక ప్రాతినిధ్యం, నాయకత్వాలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన అంశాలు.
మహిళల ఆర్థిక సాధికారిత
: మహిళాసాధికారత లేకుండా అసమానతలు లేని సమాజం, కాలుష్యరహిత పర్యావరణం అసాధ్యం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మహిళల కోసం పనిచేయదు. వారి సంపూర్ణ సామర్థా్యల నుండి ప్రయోజనం పొం దదు. ఆర్థిక విప్లవం నేడు అత్యవసరం అని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ ఉప కార్యనిర్వాహక నిర్దేశకులు లక్ష్మి పురి అన్నారు. ఆదాయ అసమా నతలు, సామాజిక స్థితిగతులు, పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ, జాతి, భౌగోళిక వివక్షతలు, ప్రధాన స్రవంతిలో లేని మహిళల అసంఘటిత శ్రమలు, ఆర్థికంగా విలువగట్టని, డబ్బుచెల్లింపులు జరగని మహిళల శ్రమ మహిళల ఆర్థిక సాధి కారిత పై విపరీత ప్రభావం కలిగిస్తాయి.
పరిష్కార మార్గాలు : మహిళలు రాజకీయాలకు పనికిరారన్న, ఇళ్ళు దాటి బయటకు రాకూడదన్న మతనియమాలున్న దేశాలున్నాయి. స్త్రీలు హేతుబద్ద నిర్ణయాలు తీసుకోలేరనడమే గాక జుట్టు కత్తిరించుకోవడం లాంటి వ్యక్తిగత అలవాట్లను ఎత్తిచూపి అలాంటివారు ఆడువారేకాదన్న ప్రబుద్ధనాయకులు మన
దేశంలోనూ ఉన్నారు. అనేక దేశాలలో లింగ వివక్షతా చట్టాలు నేటికీ కొనసా గుతున్నాయి. ఉన్న చట్టాలను పట్టించుకోవడంలేదు. ఫలితంగా అతివలు అనేక అన్యాయాలకు గురవుతున్నారు. ఉదాహరణకు ప్రపంచవ్యాపితంగా జీవించియున్న మహిళలలో 70 కోట్ల మంది బలవంతపు బాల్యవివాహాలకు గురైనవారే. సామాజిక స్పృహ కలిగిన ప్రజలు మానవత్వ చట్టనిర్మాణానికి, వివిక్షతారహిత, అహింసాయుత, శిక్షాభీతి, క్రమశిక్షణా సమాజానికి దారి తీస్తా రు. మహిళా నాయకత్వ స్థానాల సంఖ్యను పెంచుకోవాలి. దేశ వ్యాపితంగా శక్తిసామర్థా్యలు, అర్హతలు గల మహిళలను తయారు చేయాలి. మహిళా రాజ కీయ ప్రాతినిథ్యంతో కలిగే ప్రయోజనాలను ప్రచారం చేయాలి. మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. పాలనా సంస్థలలో మహిళలకు సరైన సహకారం, మద్దతులను అందించాలి. ప్రత్యేక ప్రచార పద్దతులను పాటించాలి. మహిళా సంఘాలు, పౌరసంఘాలు మహిళాప్రాతినిథ్య పెంపుదలకు ఉద్యమించాలి. చట్టాలను, పరిపాలనావ్యవస్థను మార్చాలి. రాజ్యాంగాన్ని సవరించాలి. మహి ళా ప్రాతినిథ్య సంఖ్యపై రాజకీయ పార్టీలకు నియమాలు విధించాలి. ముందుగా ఆయా సంస్థల పురుషపుంగవుల ఆలోచనా ధోరణ మారాలి. టి.వి. లలో ప్రసారమవుతున్న మహిళా ధారావాహికలను ఆపేయాలి. మహిళలకు ప్రత్యా మ్నాయ కాలక్షేపం లేక టి.వి.లకు అతుక్కు పోతున్నారన్న వాస్తవాన్ని గ్రహిం చాలి. వారికి క్రియాశీలక జీవిత పాత్రను, ప్రాతినిధ్యాన్ని కుటుంబ పరంగా అప్పజెప్పాలి. చారిత్రక ప్రసిద్ధి గాంచిన, జాతి నిర్మాతలైన, సమాజ నిర్మాణంలో పాలుపంచుకొన్న, రాజకీయ విజయాలు సాధించిన మహిళల జీవిత చరిత్ర లతో ఉద్దీపన, ప్రోత్సాహం కలిగించాలి. మహిళాచిత్రాల నిర్మాణం పెంచటంతో పాటు వాటిని వనితలు వీక్షించే అవకాశం కల్పించాలి. ఈ దిశలో మహిళా సంఘాలు ప్రయత్నించవచ్చు. ఎన్నికల వ్యవస్థలు కూడా స్త్రీలు ఎన్ని కలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించవు. రాజకీయ పార్టీలు మహిళలకు గెలిచే స్థానాలను కేటాయించవు. వారికి ఎన్నికల ఖర్చును పూర్తిగా ఇవ్వవు. మిహ ళలకు ఆర్థిక వనరులుండవు. పురుష సమాజ మాధ్యమాలు కూడా స్త్రీ అభ్య ర్థులకు తక్కువ ప్రాముఖ్యతనిస్తాయి. ప్రచార స్థాయిలో పక్షపాతం చూపు తాయి. వ్యతిరే కతలను కొనసాగిస్తాయి. సంప్రదాయ, సాంస్కృతిక కారణాలతో సమాజమే కాదు కుటుంబ సభ్యులు కూడా మహిళా భాగస్వామ్యాన్ని తిరస్క రిస్తారు. కుటుంబాన్ని కాదనే పరిస్థితి, ధైర్య సాహసాలు మహిళలకుండవు. ఈ సమ స్యల పరిష్కార దిశలో ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి.
కొస మెరుపు : మగవారందరూ మహిళావ్యతిరేకులు కారు. ప్రగతి కాము కులు, ప్రత్యేకించి మార్కి్సస్టులు మహిళా శ్రేయోభిలాషులు, మానవతావాదు లు. పచ్చి పెట్టుబడిదారీ పడతుల వల్ల మహిళాలోకానికి మంచి జర గదు. ఆధ్యాత్మిక అమ్మలు, రాజకీయ రాణులు, మనువాద సమర్థక మగువల వల్ల మహిళలకే కాదు సమాజానికీ, దేశానికీ చేటే. వీళ్ళెవరూ స్త్రీ సాధికారతకు పాటుబడరు. మహిళాప్రగతి ఇక ఏమాత్రం సమస్య కాదు, (సమస్య) మహిళా నాయకత్వాన ప్రగతి. స్త్రీ సాధికారిత లేకుండా మానవత్వ పురోగతి అసం పూ ర్ణం. 25.02.2017 న కోయంబత్తూరు లో 112 అడుగుల ఆదియోగి శిరో శిల్పాన్ని పవిత్రీకరించిన తర్వాత మన మను ప్రధాని ఇలా అన్నారు. స్త్రీలు ప్రగ తి సాధించారని, వారు నాయకత్వ స్థానాలకు ఎదగడమే జరగాలని ఆయన ఉదే ్దశమా? ఏది ఏమైనా అర్ధనారీశ్వరుని సన్నిధిలో మానవత్వ పురోగతి, స్త్రీ సాధి కారితల సంబంధాన్ని గుర్తించిన మోదీ ఆ దిశలో మాటలతో గాక చేతలతో పయనిస్తారని కోరుకుందాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa