జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బి. కొత్తకోట ఎంపీడీవో శంకరయ్య, ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని తుమ్మణం గుట్ట సచివాలయంలో సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో విస్తరింపజేయాలన్నారు. లబ్ధిదారులకు వివిధ సర్టిఫికెట్లను ఉచితంగా అందజేశారు. తహసిల్దార్, వాలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa