ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. వలంటీర్లను దూరం చేయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ లో టాప్ 10లో ఏపీ లేదని, తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉందని, కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడగలవా.. మాట్లాడితే మక్కెలిరగ్గొడతారు అంటూ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.