గుంటూరులోని హిందూ కాలేజీ కూడలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బుధవారం జనసేన పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వారాహి విజయయాత్ర ఎప్పుడైతే మొదలైందో అప్పుడే వైసీపీకి ఓటమి ఖాయమైందన్నారు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా పవన్ కల్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa