ఏలూరు జిల్లా కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోని పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో హత్యకు గురైన నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధనరెడ్డి కేసులో దోషులను వదలిపెట్టేది లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. బుధవారం ఆయన పాఠశాలను పరిశీలించిన అనంతరం అఖిల్‌రెడ్డి తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. బాలుడి హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని నిందితులను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. అఖిల్ తల్లిదండ్రులకు సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల చెక్‌ను అందచేశారు. వాలంటీర్‌గా పనిచేస్తున్న బాలుడి తండ్రికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, జగనన్న ఇల్లు అందజేస్తామని తెలిపారు.