ఓ యువకుడు భరతనాట్యం చేస్తూ తిరుమల ఆలయానికి చేరుకున్నాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ పి.కృష్ణవాసు శ్రీకాంత్ భరతనాట్య కళాకారుడు. ఆయన బుదవారం రోజు శ్రీవారి మెట్టు మార్గం నుంచి భరతనాట్యం చేసుకుంటూ 75 నిమిషాల్లో తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నృత్యాన్ని భక్తులకు పరిచయం చేసే ప్రయత్నమే ఇది. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమలకు చేరుకున్నా' అన్నారు.