రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) ఆమోదించిన మేరకు కడప జిల్లాలో రూ.8,103 కోట్లతో పంప్డ్ స్టోరేజీ జల విద్యుదుత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలానే వేంపల్లె మండలంలో జేఎ్సడబ్ల్యూ సంస్థ దీనిని ఏర్పాటు చేస్తుందని సమాచార పౌరసంబంధాల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరులకు తెలిపారు. అలాగే గండికోట రిజర్వాయరు నిర్వాసితులకు రూ.454 కోట్లతో పరిహార ప్యాకేజీకి సమ్మతించిందని తెలిపారు.