బాలల సమస్యలు పెద్దల కన్న బాలలకు మాత్రమే బాగా తెలుస్తాయని, వారు మాత్రమే వారి తోటి వారి ఆలోచనలు అర్దం చేసుకోగలుగుతారని పార స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ నిమ్మ రాజు శ్రీనివాసమూర్తి అన్నారు. గురువారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు సమావేశంలో, బాలలను ఒక చోట చేర్చి వారి అభిప్రాయాలను ఆలోచనలు జాగ్రతగా వినడం ద్వారా వారి రక్షణకు బలమైన పునాది వేయవచ్చని ఆయన అన్నారు.