స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 65,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 19,414 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టీసీఎస్ (2.47%), ఇన్ఫోసిస్ (2.40%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.51%), టెక్ మహీంద్రా (1.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.32%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.63%), మారుతీ (-1.86%), ఎన్టీపీసీ (-1.26%), రిలయన్స్ (-0.83%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.82%).