ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులు వస్తున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వీసీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... విద్యారంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమన్నారు. ఇందులో భాగంగానే విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. మన విద్యావిధానం ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని కలిగేలా ఉండాలన్నారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో ఉపయోగించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమీక్షకు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.