భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఉపగ్రహ రూపకల్పనలో మన తెలుగమ్మాయి ఉండటం గర్వకారణం. చిత్తూరు జిల్లాకు చెందిన కల్పన కాళహస్తి చెన్నైలో బీటెక్ ఈసీఈ చదివారు. 2000లో శాస్త్రవేత్తగా ఇస్రోలో విధుల్లో చేరింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. తమిళనాడుకు చెందిన పీ.వీరముత్తువేల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, అసోంకు చెందిన ఛాయన్ దత్తా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.