తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా, కమ్మవారిపల్లె పంచాయతీలోని కమ్మవారిపల్లె, తురకపల్లె, మిట్టమీదపల్లె, గోర్లపల్లె, తదితర గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి మినీ మేనిఫేస్టోను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... టీడీపీ హయాంలోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందిందన్నారు.జగన్ ప్రభుత్వంలో మహిళలు, యువత అన్నివిధాలా మోసానికి గురయ్యారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa