ఓ వ్యక్తి తన కూతురికి అమ్మవారి దగ్గర తులాభారం మొక్కుకున్నాడు. అసలే టమాటాల కాలం.. అందుకే తులభారం మొక్కును టమాటాలతో తీర్చుకున్నాడు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం ఉంది. పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య తులాభారం కోవెల ఆవరణలో నిర్వహించారు. ముందుగా 51 కేజీల టమాటాలతో, తర్వాత బెల్లం, పంచదారతో నిర్వహించారు. వీటిని అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. మార్కెట్లో టమాటాల ధర కేజీ రూ.120పైనే ఉండటంతో తులాభారం నిర్వహించే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.