నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఎవర్నో చూసి కాపీ కొట్టకూడదు అని మనసులో అనుకున్నానని.. లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన సమయంలో ఏం చేస్తాడులే అని తనకు అనిపించిందని నిర్మా త బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు న్నారు. తన తల్లి అంటే ఎంత గౌరవమో.. నారా భువనేశ్వరి అంటే తనకు అంతే గౌరవం ఉందన్నారు. ఆమె తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. తనది టీడీపీ కాదని.. చంద్రబాబుతో సంబంధం లేదు.. తనకు వాళ్లతో ఎలాంటి లబ్ధి కూడా అవసరం లేదన్నారు.
కానీ నార భువనేశ్వరి మాట్లాడే పద్దతి, నడిచే విధానం, ఆవిడ క్రమశిక్షణను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందన్నారు బండ్ల గణేష్. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సమయంలో.. 20 రోజులో, 30 రోజులో చేసి వెనక్కు వస్తారని తాను భావించానని.. ఈ మహాతల్లి భువనేశ్వరి ఎంత బాధపడుద్దో అని అనుకున్నానని.. తాను కూడా మనసులో బాధపడినట్లు చెప్పుకొచ్చారు. ఒకటో రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు గమనిస్తే లోకేష్ చాలా మారిపోయారన్నారు. రాజకీయాలపై పట్టు, జనరల్ నాలెడ్జ్, ప్రసంగాల్లో చాలా మార్పు కనిపించిందన్నారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ పాదయాత్రపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
లోకేష్ వాళ్ల అమ్మకు, నాన్నకు థ్యాంక్స్ చెప్పకూడదని.. లోకేష్ సీఎం జగన్, మంత్రి రోజా, కొడాలి నానిల కు థ్యాంక్స్ చెప్పాలన్నారు గణేష్. వాళ్లు తిట్టబట్టే లోకేష్ పౌరుషంతో ఇలా మారిపోయారని తన ఫీలింగ్ అన్నారు. గతంలో లోకేష్‌ను ఎన్నో అన్నారు, విమర్శించారని.. టీడీపీకి అధికారం వస్తదో రాదో తెలియదు కానీ.. లోకేష్ సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అయ్యారని.. మంచి భవిష్యత్ కూడా ఉంటుందన్నారు.
పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రోడ్లపై తిరుగుతున్నారన్నారు బండ్ల. పవన్ తప్పు మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు హుందాగా విమర్శించాలి కానీ.. నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దన్నారు. మంత్రులు, నేతల వల్ల జగన్ ఇబ్బంది పడతారని.. రాజకీయాలు చేయాలి కానీ బూతులు మాట్లాడొద్దన్నారు. మంత్రి పదవి, అధికారం, హోదా శాశ్వతం అనుకోకూడదని హితవు పలికారు.
నారా లోకేష్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న సమయంలో కూడా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. నిజంగా తాను లోకేష్ 200 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేయరు అనుకున్నానని.. ఏదో ఒక సాపు చెప్పి ఆపేస్తారని ఊహించుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ తాను అనుకున్నది తప్పని.. 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం చాలా ఆనందం ఇచ్చిందన్నారు. తనకు టీడీపీతో సంబంధం లేదు కానీ అభిమానం ఉందన్నారు.. లోకేష్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.