ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి....చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 17, 2023, 07:20 PM

ఓటు మన బాధ్యత.. ఓటుతో భద్రత.. ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. జులై 21 నుంచి నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగనుందని గుర్తు చేశారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారని.. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 'మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి' అని సూచించారు. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. చెక్ యువర్ ఓట్.. గెట్ యువర్ ఓట్ అంటూ ట్వీట్ చేశారు.


ఎవరైనా లిస్టులో తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే.. https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు సెలక్ట్ చేయాలి.. వాటిపై క్లిక్‌ చేసి జిల్లా, శాసనసభ నియోజకవర్గం సెలక్ట్ చేసి అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ ఫైల్స్‌లో ఉంటాయి. ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి పేరు ఉందా? లేదా చూసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లోనే పై సెర్చ్‌ యువర్‌ నేమ్‌ అనే ఆప్షన్ కూడా ఉంటుంది.


అలాగే https://voterportal.eci.gov.in వెబ్‌సైట్‌‌లో సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి, ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు.పేరు ఉందా? లేదా? ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్‌ నంబర్‌ ఎంత వంటి వివరాలన్నీ ఉంటాయి. అంతేకాదు Voter Helpline మొబైల్‌ యాప్‌‌లో కూడా ఫోన్‌ నంబర్‌, వివరాలతో రిజిష్టర్‌ చేసుకుని, లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఆ యాప్‌లో సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి కూడా ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్‌ కోడ్‌ను యాప్‌లో స్కాన్‌ చేసి ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవచ్చు.


ఓటు లేని వాళ్లు బీఎల్వోకు దరఖాస్తు చేసుకోవాలి.. నేరుగా ఫారం-6 దరఖాస్తులు సమర్పించాలి. ప్రతి నియోజకవర్గానికీ డివిజన్‌ స్థాయి అధికారిని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు ఉంటారు. ప్రతి మండలంలో తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ను అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా ఎన్నికల సంఘం నియమించింది. వారి కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు www.nvsp.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఫాం-6: అప్లికేషన్‌ ఫామ్‌ ఫర్‌ న్యూ ఓటర్స్‌‌లో వివరాలు నింపి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత రిఫరెన్స్‌ ఐడీ నంబరు ద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు.


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాలు ఆధారంగా బూత్‌ స్థాయి అధికారి చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో అధికారులు పేరు చేరుస్తారు. Voter Helpline అనే మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్‌ చేయాలి. ఓటు నమోదుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com