రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. కాకినాడ రూరల్ పరిధిలోని రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్రకు తక్షణమే రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఆరుద్ర బిడ్డ వైద్యం కోసం ఆస్తి అమ్ముకునే విషయంలో అడ్డుపడుతున్న కానిస్టేబుళ్ల అంశాలతోపాటు మరికొన్ని విషయాలను వివరించారు. ఆరుద్రకు తగిన చికిత్స అందించాలని, నిందితులపై విచారణ జరిపించాలని కోరారు.